Notifications23rd Jul 09:02 AMSunil Byrisetty1 min read
మెడికల్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రంలోని మెడికల్, దంత వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా కళాశాలల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్
రాష్ట్రంలోని మెడికల్, దంత వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా కళాశాలల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రాసి స్థానిక ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 నుంచి 29న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూర్తిచేసి పంపాలి. అపరాధ రుసుం (రూ.20 వేలు) తో ఈ నెల 30న ఉదయం 7 నుంచి 31న రాత్రి 9 గంటల్లోగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.