Education22nd Jul 04:37 PMSunil Byrisetty1 min read
'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'లో ప్రవేశాలకు ఆహ్వానం
రాష్ట్రసాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (COE) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ ఐఐటీ,
రాష్ట్రసాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (COE) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ, నీట్ లలో ఉచిత శిక్షణతో కూడిన జూనియర్, సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) డా. ఐ. శ్రీదేవి తెలిపారు.
రాష్ట్రంలోని మేఘాద్రిగడ్డ (విశాఖపట్నం జిల్లా), అమరావతి-తాడికొండ (గుంటూరు జిల్లా), మరియు కోట (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా) లలోని మూడు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' (కో ఎడ్యుకేషన్ ) కేంద్రాలలో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. మార్చి 2026లో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులై, కనీసం 85 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అర్హులని, అలాగే మార్చి 2026 జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌పోర్టల్ https://apbragcet.apcfss.in ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి జూలై 30, 2026 చివరి తేదీ అని తెలిపారు.