News12th Apr 12:44 PMSunil Byrisetty1 min read
'పద్మ' అవార్డులకు దరఖాస్తు చేసుకోండి
కేంద్ర హోం మంత్రిత్వశాఖ పద్మ అవార్డులు-2026 నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు 2025 జులై 31 లోపు నామినేషన్లు
కేంద్ర హోం మంత్రిత్వశాఖ పద్మ అవార్డులు-2026 నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించింది.
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు 2025 జులై 31 లోపు నామినేషన్లు, సిఫార్సులను పంపాలని ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. వాటిని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.inలో స్వీకరిస్తామని తెలిపింది.
మరిన్ని వివరాలు హోం మంత్రిత్వశాఖ వెబ్సైట్ https://mha.gov.inను సంప్రదించాలని సూచించింది.
ఈ అవార్డుల కింద పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఉంటాయి