Jobs7th Sep 05:39 PMSunil Byrisetty1 min read
913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం
ప్రజల ముంగిటకు వైద్య సేవలు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 913 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిం
ప్రజల ముంగిటకు వైద్య సేవలు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 913 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీటి భర్తీతో రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని పేర్కొన్నారు. గడిచిన రెండు సంవత్సరాల్లో 1,294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, తాజా 913 పోస్టులతో కలిపితే మొత్తం 2,207 పోస్టులు భర్తీ చేసినట్లవుతుందని మంత్రి తెలిపారు. తాజా ఖాళీల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళల్లో పదో తరగతి కనీస అర్హత కలిగి, 25–45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
జిల్లాల వారీగా చూస్తే...అనకాపల్లిలో 77, కర్నూలులో 65, తూర్పుగోదావరిలో 44, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యంలో 43, పశ్చిమగోదావరిలో 42, అన్నమయ్యలో 41, ప్రకాశంలో 38, వైఎస్సార్ కడపలో 38, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 33, చిత్తూరులో 32, కోనసీమలో 32, పల్నాడులో 31, విజయనగరంలో 31, కాకినాడలో 29, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరులో 29, ఏలూరులో 27, అనంతపురంలో 26, మార్కాపురంలో 25, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, శ్రీకాకుళంలో 22, గుంటూరులో 21, నంద్యాలలో 21, పోలవరంలో 21, తిరుపతిలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్లలో 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.