Politics14th Aug 11:51 AMSunil Byrisetty1 min read

గ్రూప్ 1 కుంభకోణంలో సవాంగ్ పాత్ర?

రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 కుంభకోణం వెనుక పెద్ద తలకాయలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ డీజీపీ, నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్‌ పాత్ర ఉందనే అనుమానాలు వ్

గ్రూప్ 1 కుంభకోణంలో సవాంగ్ పాత్ర?
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 కుంభకోణం వెనుక పెద్ద తలకాయలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ డీజీపీ, నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్‌ పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ ఆమోదం లేకుండానే మూల్యాంకనాలు పూర్తి చేసి, రికార్డులు మాయం అయినట్లు వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో పేపర్లు దిద్దించిన వ్యవహారాన్ని దాచిపెట్టినట్లు బయటకొచ్చింది. హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించి అర్హులైన వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న స్కామ్ వెనుక గత ప్రభుత్వ పెద్దలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారగానే ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం వెనుక కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh
AP Politics
Recruitment Scam
APPSC Group 1 Scam
Gautam Sawang
APPSC
Group 1 Recruitment
APPSC Chairman
సిట్ దర్యాప్తు
హైకోర్టు
మూల్యాంకన అవకతవకలు
ప్రభుత్వ ఉద్యోగాలు
Scroll for the next article