Notifications13th Aug 04:16 PMSunil Byrisetty1 min read

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల

ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ, దేవాదాయ, భూగర్భజల శాఖలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో నోటిఫికేషన్లను పొంద

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల
ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ, దేవాదాయ, భూగర్భజల శాఖలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో నోటిఫికేషన్లను పొందుపరచామని కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
APPSC
Andhra Pradesh
Government Jobs
Recruitment
Agriculture Officer
Executive Officer
Technical Assistant
Job Notification
Online Application
టెక్నికల్ అసిస్టెంట్
ఉద్యోగ నోటిఫికేషన్
Scroll for the next article