Education20th Jan 03:53 PMSunil Byrisetty1 min read

2 నుంచి 6 వరకు ఏపీఆర్సెట్ -2024 ఇంటర్వ్యూలు

ఏపీఆర్సెట్ -2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు ఇంటర్వ్యూల షెడ్యూల్ ను మండలి కార్యదర్శి బి. తిరుపతిరావు విడుదల చేశ

2 నుంచి 6 వరకు ఏపీఆర్సెట్ -2024 ఇంటర్వ్యూలు
ఏపీఆర్సెట్ -2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు ఇంటర్వ్యూల షెడ్యూల్ ను మండలి కార్యదర్శి బి. తిరుపతిరావు విడుదల చేశారు. అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అందుకోసం పలు వర్సిటీలను ఎంపిక చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణాల్లో ఇంటర్వ్యూలు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు.
Andhra Pradesh Higher Education Council
APRCET 2024
APRCET Interviews
AP Higher Education
Research Entrance Test
Interview Schedule
February 2 to 6
Sri Venkateswara University
Scroll for the next article