News10th Jul 11:15 AMSunil Byrisetty1 min read

హైదరాబాద్ ను తలదన్నేలా.. ఏపీ ఏవియేషన్

ఏపీ ప్రభుత్వ నూతన విమానయాన విధానం- ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026-31 రాష్ట్ర రవాణా రూపురేఖలు మార్చనుంది. ఇందులో అత్యంత కీలకం. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి 150 కిలోమీటర్ల రేడియస్‌లోన

హైదరాబాద్ ను తలదన్నేలా.. ఏపీ ఏవియేషన్
ఏపీ ప్రభుత్వ నూతన విమానయాన విధానం- ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026-31 రాష్ట్ర రవాణా రూపురేఖలు మార్చనుంది. ఇందులో అత్యంత కీలకం. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి 150 కిలోమీటర్ల రేడియస్‌లోనే ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ ఉండాలనేదే లక్ష్యం. ఈ పాలసీ ద్వారా.. ఏపీ ఎయిర్ ట్రాఫిక్ సామర్థ్యాన్ని 2035 నాటికి ప్రస్తుతం ఉన్న 6.2 మిలియన్ల నుండి ఏకంగా 30.38 మిలియన్లకు పెంచాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఉత్తరాంధ్ర, కోస్తా , రాయలసీమ ప్రాంతాలకు మూడు వేర్వేరు అంతర్జాతీయ గేట్‌వేలను అభివృద్ధి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఈ నూతన ఏవియేషన్ పాలసీ ప్యాసింజర్ ట్రాఫిక్‌కే పరిమితం కాలేదు. గ్లోబల్ ఎయిర్ కార్గో మార్కెట్‌లో ఏపీకి 5 శాతం వాటా దక్కేలా కార్గో హబ్‌లను ప్లాన్ చేశారు. అమరావతిలో ఏవియేషన్ యూనివర్సిటీని, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సౌకర్యాలను కూడా ఇందులో భాగం చేశారు. భోగాపురం ఓపెనింగ్, అమరావతి గ్రీన్‌ఫీల్డ్ పనులు, తిరుపతి ఇంటర్నేషనల్ విస్తరణ వేగంగా పూర్తయితే.. వచ్చే ఐదేళ్లలో ఏపీ ఎయిర్ ట్రాఫిక్ భారీగా పెరగనుంది. తద్వారా హైదరాబాద్‌పై ఆధారపడటం 80 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh Aviation Policy 2026-31
Andhra Pradesh
Aviation Policy
Airports
Bhogapuram Airport
Amaravati
Tirupati International Airport
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్
మౌలిక సదుపాయాలు
విమాన రాకపోకలు
Scroll for the next article