News27th Jun 10:54 AMSunil Byrisetty1 min read

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. వర్షాలు

ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. వర్షాలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొంది. భారీ ఈదురుగాలులు వీస్తాయని, సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. ఈ అల్పపీడనంతో ఇక వర్షాకాలం మొదలైనట్లే.
Andhra Pradesh news
APSDMA
rains
Bay of Bengal
weather forecast
coastal Andhra rain alert
cyclone warning India Meteorological Department
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
Scroll for the next article