News11th Jun 12:03 PMSunil Byrisetty1 min read
ఆంధ్రాలో నేడు, రేపు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధ, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధ, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.