News23rd Oct 12:30 PMSunil Byrisetty1 min read
APSPF ఆవిర్భావ దినోత్సవo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(APSPF) ఆవిర్భావ దినోత్సవం 2025 గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్ జనరల్ డా. త్రివిక్రమ వర్మ, ఇన్స్పెక్టర్ జనరల్ బి.వి.రామ్ రెడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(APSPF) ఆవిర్భావ దినోత్సవం 2025 గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్ జనరల్ డా. త్రివిక్రమ వర్మ, ఇన్స్పెక్టర్ జనరల్ బి.వి.రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరు కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఆమె స్థానంలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ SPF ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఘనంగా ఉన్నదని, ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించిన డా. త్రివిక్రమ్ వర్మని మరియు ఇతర అధికారులను సిబ్బందిని ప్రసంశించారు. 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి 2000 బ్యాచ్ కానిస్టేబుల్స్ ను అప్గ్రేడ్ చేయుటకు ప్రభుత్వ పరిశీలనలో ఉందని హామీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత SPF ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం ఇది మొదటి సారి అని తెలిపారు. SPF ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.