Jobs27th Oct 11:05 AMSunil Byrisetty1 min read
ఏపీఎస్ ఆర్టీసీలో కొలువుల జాతర
నిరుద్యోగ యువతకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పలు పోస్టుల భర్తీకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 277 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఏపీ ర
నిరుద్యోగ యువతకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పలు పోస్టుల భర్తీకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 277 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఏపీ రోడ్డు రవాణా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రకటించింది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8వ తేదీగా నిర్ణయించింది. ఆర్టీసీలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ వంటి పలు విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను చూస్తే నంద్యాల జిల్లాలో 43, కర్నూలు జిల్లాలో 46, అనంతపురం జిల్లాలో 50, శ్రీ సాయి జిల్లాలో 34, కడప జిల్లాలో 60, అన్నమయ్య జిల్లాలో 44 అప్రెంటిస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.