News7th Jan 12:45 PMSunil Byrisetty1 min read

సంక్రాంతికి 8 వేల ఆర్టీసీ బస్సులు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దాదాపు 8 వేలకు పైగా ప్రత్యేక బస్

సంక్రాంతికి 8 వేల ఆర్టీసీ బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దాదాపు 8 వేలకు పైగా ప్రత్యేక బస్సులు సిద్ధం చేస్తోంది. రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలకు 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి 2,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. దీంతో ప్రైవేట్ దోపిడీ కొంతమేర తగ్గుతుందని భావిస్తున్నారు.
Andhra Pradesh
Festival Rush
APSRTC
Sankranti Travel
Special Buses
Public Transport
హైదరాబాద్
బెంగళూరు
చెన్నై
Scroll for the next article