News6th Oct 03:54 PMSunil Byrisetty1 min read

ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు @100 కోట్లు

ఆంధ్రప్రదేశ్ లో 100 కోట్లకు పైగా మహిళల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పిస్తున్న వి

ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు @100 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లో 100 కోట్లకు పైగా మహిళల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ పథకం ప్రారంభించి ఏడాది దాటుతోంది. ఈ కాలంలో 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలను మహిళలు వినియోగించుకొన్నారని ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. స్త్రీ శక్తి పథకంలో ఇదొక చారిత్రక మైలురాయి అని కొనియాడారు. ఈ ప్రయాణాల వల్ల మహిళలకు రూ.3,500 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారన్నారు. ఈసందర్భంగా ఆర్టీసీ సిబ్బందికి ఛైర్మన్‌ అభినందనలు తెలిపారు.
Scroll for the next article