Jobs9th Jul 04:57 PMSunil Byrisetty1 min read

APSSDC మరియు BNI మెగా జాబ్ మేళా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విజయ

APSSDC మరియు BNI మెగా జాబ్ మేళా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విజయవాడ పి.బి. సిద్దార్థ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, "మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, BNI ప్రతినిధులు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా ను 100 కి పైగా కంపెనీలతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI, పాలిటెక్నిక్, డిగ్రీ, బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మసీ పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని తెలిపారు. ఎంపిక అయిన వారికి నెలకి Rs. 12,000/- నుంచి Rs. 50,000/- వరకు వేతనము, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని తెలిపారు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration లింక్ లో రిజిస్టర్ కావాలన్నారు. మెగా జాబ్ మేళాకు Resume తో లేదా Bio Data Forms తో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్, PAN కార్డ్ కాపీ, సర్టిఫికెట్ల Xerox కాపీలతో రావాలని తెలిపారు. వివరాలకు కళ్యాణ్ - 83339 08080, నరేష్ - 90326 33548, కిషోర్ - 99857 59304 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
APSSDC
BNI
Mega Job Mela
Vijayawada
Jobs in Andhra Pradesh
Job Fair
Recruitment Drive
Employment
Freshers Jobs
Career Opportunities
ఐటీఐ ఉద్యోగాలు
డిగ్రీ ఉద్యోగాలు
బీటెక్ ఉద్యోగాలు
ఫార్మసీ ఉద్యోగాలు
Scroll for the next article