News5th Aug 02:33 PMSunil Byrisetty1 min read
విజయవాడ- వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి విజయవాడ - వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. భక్తులకు, పర్యాటకులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళి
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి విజయవాడ - వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. భక్తులకు, పర్యాటకులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళికాబద్ధమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీకి రూపకల్పన చేశారు. ఈ టూర్ ప్యాకేజీ ఉదయం 4 గంటలకు విజయవాడలోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ వద్ద ప్రారంభమై, తిరిగి సాయంత్రం 7 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ప్యాకేజీ ధర పెద్దలకు రూ. 1,160/-, పిల్లలకు రూ. 1,000/- గా నిర్ణయించారు. బస్సు రవాణా ఛార్జీలతో పాటు ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన వసతి కలిగి ఉంటాయి. అయితే ఆలయ దర్శనం టికెట్ ఛార్జీలను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. ఈ యాత్రను సద్వినియోగం చేసుకోవాలనుకునే భక్తులు www.aptdc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, లేదా విజయవాడ బందర్ రోడ్, లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO) వద్ద నేరుగా సంప్రదించాలి.