News7th Oct 02:15 PMSunil Byrisetty1 min read
సేవా సేతు అభియాన్ క్యాంపు సందర్శన
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజిలి యోజన అమలులో భాగంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో నిర్వహిస్తున్న “సేవా సేతు అభియాన్”లో భాగంగా గుణదలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును APTRANSCO JMD సూర
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజిలి యోజన అమలులో భాగంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో నిర్వహిస్తున్న “సేవా సేతు అభియాన్”లో భాగంగా గుణదలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును APTRANSCO JMD సూర్య సాయి ప్రవీణ్‌చంద్ సందర్శించారు. క్యాంపులో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్, అవగాహన, దరఖాస్తుల స్వీకరణ, రూఫ్‌టాప్ సోలార్ పథకానికి సంబంధించిన సాంకేతిక సమాచారం, బ్యాంకింగ్ సేవలు తదితర కౌంటర్లను JMD స్వయంగా పరిశీలించారు. క్యాంపునకు వచ్చిన వినియోగదారులతో JMD మాట్లాడి, ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం గురించి వారికి ఉన్న అవగాహన, రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవడంలో ఎదురవుతున్న సందేహాలు, దరఖాస్తు ప్రక్రియ తదితర అంశాలను తెలుసుకున్నారు. వినియోగదారులకు అందిస్తున్న సమాచారం, దరఖాస్తుల స్వీకరణ విధానం, సబ్సిడీకి సంబంధించిన వివరాలు, సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యాంపులో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు సంబంధించిన వివిధ దశలను వినియోగదారులకు ఎలా వివరిస్తున్నారు, దరఖాస్తు నుంచి సబ్సిడీ పొందే వరకు ఎలాంటి సహాయం అందిస్తున్నారు అనే అంశాలను కూడా JMD పరిశీలించారు. బ్యాంకర్లతో, సౌర విద్యుత్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వినియోగదారులకు అందిస్తున్న సహకారం గురించి తెలుసుకున్నారు.