Jobs28th Aug 10:30 AMSunil Byrisetty1 min read
ఏపీ టీఎస్ లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) లో 6 జిల్లాలకు గాను జిల్లా
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) లో 6 జిల్లాలకు గాను జిల్లా ఐటీ మేనేజర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుకు అర్హతలు ఇలా ఉండాలి.
B.Tech/M.Sc. (Computer Science / IT / Electronics / Electrical subjects) లేదా సమానమైన డిగ్రీ ఉండాలి. కనీసం 3 సంవత్సరాల
సంబంధిత అనుభవం తప్పనిసరిగా కావాలి. MBA ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
వేతనం రూ.40,000/- ప్రతి నెల ఉంటుంది. దరఖాస్తులు ఆన్ లైన్ లో పూర్తిచేయాలి. మరిన్ని వివరాలకు https://apts.gov.in/careers వెబ్ సైట్ చూడండి.