News13th Mar 10:29 AMSunil Byrisetty1 min read

పార్లమెంట్ లో అరకు కాఫీ ఘుమఘుమలు

అరకు కాఫీకి ప్రత్యేక స్థానం కల్పించేందుకు పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీప

పార్లమెంట్ లో అరకు కాఫీ ఘుమఘుమలు
అరకు కాఫీకి ప్రత్యేక స్థానం కల్పించేందుకు పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, స్పీకర్ ఓం బిర్లాను కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని వివరించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గిరిజన ప్రాంతమైన అరకు వ్యాలీ ఈ కాఫీ పంటకు ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని ఏపీ పార్లమెంటు సభ్యులు స్పీకరును కోరారు. అందుకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పర్మినెంట్ స్టాల్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Araku coffee
Parliament
RamMohanNaidu
అరకుకాఫీ
పార్లమెంట్
రామ్ మోహన్ నాయుడు
Scroll for the next article