News4th Oct 09:54 AMSunil Byrisetty1 min read

అరకు కాఫీకి ఛేంజ్ మేకర్ అవార్డు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకుంది. అవార్డు సాధించిన గిరిజన సహకార సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. అ

అరకు కాఫీకి ఛేంజ్ మేకర్ అవార్డు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకుంది. అవార్డు సాధించిన గిరిజన సహకార సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. అరకు వ్యాలీకి కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును, ప్రశంసా పత్రాన్ని సీఎం పరిశీలించారు. జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా మారిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రీయ విధానంలో సాగు అవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువానలతో పాటు.. ప్రత్యేక రుచిని కలిగి ఉందన్నారు. ఈ విశిష్టత కారణంగా అరకకు మంచి బ్రాండ్ అనే పేరు వచ్చిందని సీఎం చెప్పారు.
Andhra Pradesh
Araku Coffee
Change Maker Award
BusinessLine Awards
Tribal Cooperative
Chandrababu Naidu
Gummadi Sandhya Rani
Kalpana Kumari
జీఐ ట్యాగ్
సేంద్రీయ కాఫీ
అంతర్జాతీయ బ్రాండ్
అరకు వ్యాలీ
Scroll for the next article