Sports11th Aug 11:20 AMSunil Byrisetty1 min read

గిరిజన యువతను క్రీడల్లో ప్రోత్సహించండి

అరకు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, దానిని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అరకు ఎంపీ డా. గుమ్మా తనూజరాణి కోరారు. ఈ మేర

గిరిజన యువతను క్రీడల్లో ప్రోత్సహించండి
అరకు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, దానిని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అరకు ఎంపీ డా. గుమ్మా తనూజరాణి కోరారు. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి Dr. మనసుఖ్ మండవుయాకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు మిథున్ రెడ్డి, గురుమూర్తితో కలిసి ఆమె ప్రాతినిధ్యం సమర్పించారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, ఆర్చరీ, షూటింగ్‌ తదితర క్రీడల్లో గిరిజన విద్యార్థులకు సహజ ప్రతిభ ఉన్నప్పటికీ, సరైన మైదానాలు, క్రీడా పరికరాలు, శిక్షణ, కోచ్‌లు అందుబాటులో లేక అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. ASR - మన్యం జిల్లాల ఏజెన్సీలో “ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి, బహుళ ప్రయోజన క్రీడా సముదాయాలు, ఇండోర్‌–అవుట్‌డోర్‌ క్రీడా వసతులు, రెసిడెన్షియల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలు ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు.
Andhra Pradesh
Tribal Youth
Araku MP
Tribal Sports
Sports Development
Tribal Talent
Araku Agency
ASR Manyam
Sports Infrastructure
యువత సాధికారత
అథ్లెటిక్స్
ఫుట్‌బాల్
కబడ్డీ
వాలీబాల్
బాక్సింగ్
రెజ్లింగ్
ఆర్చరీ
షూటింగ్
Scroll for the next article