Sports23rd Jul 05:21 PMSunil Byrisetty1 min read
మంత్రి మండిపల్లిని విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ
క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను ఇటీవల సాధించిన వరల్డ్ కప్ లో సాధ
క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను ఇటీవల సాధించిన వరల్డ్ కప్ లో సాధించిన పతకాల విశేషాలను మంత్రికి వివరించారు. ఆమె వెంట తండ్రి కూడా పాల్గొన్నారు. జ్యోతి సురేఖ వెన్నం సాధించిన విజయాలను మంత్రి అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.