Politics14th Nov 01:18 PMSunil Byrisetty1 min read
పార్ట్‌నర్‌షిప్ సమిట్లు అన్నీ బోగస్?
విశాఖపట్టణంలో నిర్వహించిన పార్ట్‌నర్‌షిప్ సమిట్లు అన్నీ బోగస్ అని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఇప్పుడు టీడీపీ, గతం
విశాఖపట్టణంలో నిర్వహించిన పార్ట్‌నర్‌షిప్ సమిట్లు అన్నీ బోగస్ అని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఇప్పుడు టీడీపీ, గతంలో వైయస్సార్‌సీపీ నిర్వహించిన సమిట్లలో ఎంవోయూలకు, వచ్చిన పెట్టుబడులకు, ఉద్యోగాలకు సంబంధమే లేదని ఆరోపించారు. రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. స్టేజీలమీద సూట్లూ కోట్లు వేసుకున్నవారు ఎవరూ వందల కోట్లు పెట్టుబడులుగా ఏనాడూ పెట్టలేదని అన్నారు. ఈ సమిట్లు అన్నీ తమకు కావాల్సిన వారికి నామ మాత్ర ధరకు భూములు అమ్ముకునే కుటిల పథకంలో భాగం మాత్రమేనని ఆరోపణలు చేశారు. ప్రతి సంత్సరం అదే పారిశ్రామిక వేత్తలు, అవే కోట్లు, అవే సీన్లు... పరిశ్రమలు, ఉద్యోగాలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదని వ్యాఖ్యానించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దావోస్ సమిట్లు, పార్‌టనర్‌షిప్ సమిట్ల ద్వారా మన రాష్ట్రానికి ఎన్ని గ్రీన్‌ఫీల్డ్ పరిశ్రమలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎన్ని భూముల్ని ఎవరికి ఎంతకు కేటాయించారు... ఈ అంశాలమీద పబ్లిక్ ఆడిటింగ్‌కు వీలుగా ట్రాన్స్‌పెరెంట్‌గా శ్వేత పత్రం ఇచ్చే ధైర్యం టీడీపీకిగానీ, వైయస్సార్‌సీపీకిగానీ ఉందా అని ప్రశ్నించారు.