Politics24th Oct 10:15 AMSunil Byrisetty1 min read
కూటమిలో ఉన్నామా?? లేక ప్రతిపక్షమా?
రాష్ట్రంలో కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కాని ఇక్కడ కూటమంటే జనసేన లేనట్టు జనసేన ఎంపీటీసీ సభ్యులపై దాడులా సిగ్గు సిగ్గు అంటూ జనసేన నేత వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు
రాష్ట్రంలో కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కాని ఇక్కడ కూటమంటే జనసేన లేనట్టు జనసేన ఎంపీటీసీ సభ్యులపై దాడులా సిగ్గు సిగ్గు అంటూ జనసేన నేత వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెలంకొండలో విచిత్ర పరిస్థితి నెలకొందన్నారు. ఖబర్దార్ టీడీపీ బెలంకొండ మండల నేతల్లారా.. దాడికి ఖచ్చితంగా సమాధానం ఇస్తామని గుంటూరు జిల్లా జనసేన అద్యక్షుడు గాదె వెంకటేశ్వరావు హెచ్చరిక చేశారు. రాష్ట్ర స్థాయిలో కలిసి పనిచేయలంటుంటే క్షేత్ర స్థాయిలో జనసేన అభ్యర్థులపై, వారి కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలో దాడులు చేయటం సుగ్గుచేటన్నారు. కూటమిలో ఉన్నామని శాంతీయుతంగా ఉన్నాం మీరు చేస్తే ఖచ్చితంగా ప్రతిదాడులకు తాము సిద్ధమని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, పల్నాడు ఎస్పీ వద్దకు ఇప్పటికే నామినేషన్ సెంటర్ లో మహిళపై జరిగిన దాడి వీడియోస్ వచ్చాయని వాటిపై తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.