Telangana9th Sep 11:54 AMSunil Byrisetty1 min read

మహిళలపై దాడి జరిగితే పట్టించుకోరా?

మహిళలపై దాడి జరిగితే కనీసం పట్టింపు లేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద వారు మీడియాతో చిట్ చాట్ చేశారు. స్పీకర

మహిళలపై దాడి జరిగితే పట్టించుకోరా?
మహిళలపై దాడి జరిగితే కనీసం పట్టింపు లేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద వారు మీడియాతో చిట్ చాట్ చేశారు. స్పీకర్ బాధపడ్డారని తెలుసుకొని కేసీఆర్ విచారం వ్యక్తం చేయాలని మాకు చెప్పారన్నారు. మంత్రులు అమ్మ గురించి మాట్లాడుతున్నారు.. మరి మేము కూడా మహిళలమే కదా అని వ్యాఖ్యానించారు. మాపై దాడి జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సానుభూతి వస్తుందని.. ఫోన్ చేసి విచారం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సభ జరిగినప్పుడు బయట ఏదైనా ఘటన జరిగితే అసెంబ్లీలో ప్రకటన చేస్తారు.. కానీ ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో జరిగితే కనీసం ప్రకటన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Politics
Sabitha Indra Reddy
Sunitha Lakshma Reddy
Telangana Assembly
BRS
Women Legislators
కేసీఆర్
అసెంబ్లీ ఘటన
మహిళల భద్రత
హైదరాబాద్ రాజకీయాలు
Scroll for the next article