News8th May 04:29 PMSunil Byrisetty1 min read

ఢిల్లీలో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్‌గా అర్జా శ్రీకాంత్

సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్య అభివృద్ది శాఖ సీఈవోగా వ్యవహరించిన పూర్వ ఐఆర్టీఎస్ అధికారి, డా. అర్జా శ్రీకాంత్‌కు కీలక పదవి దక్కింది. కూటమి ప్రభుత్వం

ఢిల్లీలో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్‌గా అర్జా శ్రీకాంత్
సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్య అభివృద్ది శాఖ సీఈవోగా వ్యవహరించిన పూర్వ ఐఆర్టీఎస్ అధికారి, డా. అర్జా శ్రీకాంత్‌కు కీలక పదవి దక్కింది. కూటమి ప్రభుత్వం ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్‌కు స్పెషల్ కమిషనర్‌గా శ్రీకాంత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. ఇక నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌కు వచ్చే పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఇతర అధికారులకు సంబంధించిన వ్యవహారాలు ఆయన చూసుకుంటారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే వివిధ పథకాలను పర్యవేక్షించి, సకాలంలో రాష్ట్రానికి అందేలా చూసే బాధ్యత అప్పగించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వ్యవహారాలు కూడా చూసుకుంటారు.
Andhra Pradesh
Delhi
AP Bhavan
Arja Srikanth
Commissioner
ఐఆర్టీఎస్ అధికారి
డా. అర్జా శ్రీకాంత్‌
ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్‌కు స్పెషల్ కమిషనర్‌గా శ్రీకాంత్‌
Scroll for the next article