News15th Nov 11:28 AMSunil Byrisetty1 min read
అర్జున అవార్డుతో ఏపీ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీ
అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు – 2024కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ మణిపూస, అంతర్జాతీయ అథ్లెట్
అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు – 2024కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ మణిపూస, అంతర్జాతీయ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు తన ప్రతిభతో గుర్తింపు పొందిన జ్యోతి, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో రెండు స్వర్ణ పతకాలు, ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించింది. అంటే కాకుండా 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడం గర్వకారణం. ఆమె పట్టుదల, కృషి, విజయాలు నేటి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.