News20th Apr 10:23 AMSunil Byrisetty1 min read

పర్చూరులో మాఫియా అడ్డా?

పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో అసాంఘిక కార్యకలాపాల మాఫియా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. హైవేకి సమీపంలో వైసీపీ నేత ఫ్యాక్టరీలో టన్నుల కొద్ది భారీ పేలుడు సామాగ్రి లభ్యమైంది. గ్ర

పర్చూరులో మాఫియా అడ్డా?
పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో అసాంఘిక కార్యకలాపాల మాఫియా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. హైవేకి సమీపంలో వైసీపీ నేత ఫ్యాక్టరీలో టన్నుల కొద్ది భారీ పేలుడు సామాగ్రి లభ్యమైంది. గ్రానైట్ వ్యాపారం ముసుగులో పేలుడు పదార్థాలతో భారీ కుట్రకు తెర లేపారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిఘా విభాగం తనిఖీల్లో టన్నులకొద్దీ జిలెటిన్ స్టిక్స్, పేలుడు సామగ్రి లభ్యమైనట్లు తెలుస్తుంది. మూడు నెలల క్రితం టన్నులకొద్దీ గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన ముఠా టన్నులకొద్దీ పేలుడు పదార్థాల రవాణా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపార ముఠా ముఖ్యులు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డికి సన్నిహితులని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో మార్టూరుకు చెందిన వైసిపి సీనియర్ నేత హనుమంతరావుకు సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం అవుతుంది. ఎన్నికల ముందు మార్టూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఫ్యాక్టరీలపై అధికారుల పేరుతో వైసిపి గుండాలు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలలో మారణ ఆయుధాలు , కత్తులు కర్రలు కారం పొట్లాలు లభ్యమయ్యాయి. తాజాగా వైసీపీ నేత ఫ్యాక్టరీలో భారీ పేలుడు పదార్థాలు లభ్యం కావడం వెనుక పోలీసులు రాజకీయ కుట్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
YSRCP
Parchoor
Bapatla
arms dump unearthed
Govardhan Reddy
కార్యకలాపాల మాఫియా
టన్నులకొద్దీ జిలెటిన్ స్టిక్స్
పేలుడు సామగ్రి
Scroll for the next article