News25th Apr 12:42 PMSunil Byrisetty1 min read
జమ్మూలో మరో విధ్వంసానికి కుట్ర
పహల్గామ్ దాడి తర్వాత ఆర్మీ తమను వదిలి పెట్టబోదని ముందే ఆలోచించిన ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పన్నాగం రచించారు. జమ్మూకాశ్మీర్లో భారత ఆర్మీ అధికారులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు చేస
పహల్గామ్ దాడి తర్వాత ఆర్మీ తమను వదిలి పెట్టబోదని ముందే ఆలోచించిన ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పన్నాగం రచించారు.
జమ్మూకాశ్మీర్లో భారత ఆర్మీ అధికారులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు చేసిన మరో కుట్ర బట్టబయలైంది.
పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ ఆర్మీ తమ నివాసాలకు వస్తుందని ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. భారత్ ఆర్మీసోదాలు నిర్వహించే సమయంలో పేలుడు సంభవించేలా తమ ఇళ్లలో ఐఈడీలను అమర్చారు.
సోదాలు చేస్తున్న సమయంలో ముప్పును ముందుగానే పసిగట్టిన భారత్ ఆర్మీ.. వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాయి.
దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఆర్మీ ముందస్తు ఆలోచనతో భారీ విధ్వంసాన్ని తప్పించి, వారి కుట్రలను బట్టబయలు చేసింది.