Spiritual2nd Oct 05:42 PMSunil Byrisetty1 min read

దుర్గమ్మను దర్శించుకున్న 15 లక్షల మంది భక్తులు

గడచిన సంవత్సరం 12.50 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శిస్తే ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది దర్శించుకుంటున్నారని, గతంతో పోలిస్తే ఇది 10 శాతం అధికమని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజ

దుర్గమ్మను దర్శించుకున్న 15 లక్షల మంది భక్తులు
గడచిన సంవత్సరం 12.50 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శిస్తే ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది దర్శించుకుంటున్నారని, గతంతో పోలిస్తే ఇది 10 శాతం అధికమని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నీతి నియమాలు, నైతిక విలువలతో కూడిన జీవనం గడపాలని ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి 4 కోట్ల 38 లక్షల 63 వేల 389 రూపాయల ఆదాయం వచ్చిందని సుజనా చౌదరి తెలిపారు. ఉత్సవాలలో లడ్డు ప్రసాదాలు, దర్శన టిక్కెట్లు, ప్రత్యేక పరోక్ష కుంకుమార్చనలు, చండీ హోమం, శ్రీ చక్ర నవార్చన, ప్రత్యేక ఖడ్గమాల టిక్కెట్ల విక్రయం తదితర వాటి రూపేణా ఈ ఆదాయం వచ్చినట్లు తెలియజేసారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 12,54,252 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 2, 59,117 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు.
Vijayawada
Temple Darshan
Durga Temple
Dasara 2025
Devotees
Malleswara Swamy Devasthanam
Laddu Prasadam
Chandi Homam
Sri Chakra Navarchana
Special Tickets
Temple Revenue
చండి హోమం
శ్రీ చక్ర నవార్చన
ప్రత్యేక టిక్కెట్లు
ఆలయ ఆదాయం
Scroll for the next article