News19th Oct 12:00 PMSunil Byrisetty1 min read

జాతీయ సరస్ మేళాలో సందర్శకుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు

విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తో కలిసి సందర్శించారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ ‘స

జాతీయ సరస్ మేళాలో సందర్శకుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తో కలిసి సందర్శించారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ ‘సరస్ మేళా’ ప్రాంగణాన్ని స్థానిక మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించిన అనంతరం మంత్రి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. మొదటిసారి ఢిల్లీ వెలుపల విజయవాడలో ఇంత భారీ ఎత్తున సరస్ మేళా నిర్వహిస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు. సందర్శకులు, వ్యాపారులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, డిజిటల్ చెల్లింపుల కోసం వై-ఫై సదుపాయాలు, పారిశుధ్యం తదితర అంశాలను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సందర్శకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మంచి వ్యాపారం జరిగి, వారి జీవనోపాధి మరింత మెరుగుపడేలా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.
Scroll for the next article