News31st Aug 11:14 AMSunil Byrisetty1 min read

తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు

తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో వివరాల

తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు
తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు సీఎం చంద్రబాబు, లోక్సభస్పీకర్ హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్ హాజరుకానున్నారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Andhra Pradesh
Tirupati
AP Assembly
Women MLAs
Special Session
Chandrababu Naidu
Lok Sabha Speaker
Governor
Ayyannapatrudu
Women Leadership
తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు
శ్రీ వేంకటేశ్వర దర్శనం
Scroll for the next article