News21st May 10:49 AMSunil Byrisetty1 min read
నెలరోజులపాటు నిర్వహించే యోగాంధ్రకు శ్రీకారం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజులపాటు నిర్వహించే యోగాంధ్రకు విజయనగరం జిల్లాలో శ్రీకారం చుట్టారు. నగరంలోని రాజీవ్ స్టేడియంలో యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమాన్ని జిల్లా కలెక
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజులపాటు నిర్వహించే యోగాంధ్రకు విజయనగరం జిల్లాలో శ్రీకారం చుట్టారు.
నగరంలోని రాజీవ్ స్టేడియంలో యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు ప్రారంభించారు. యోగా జీవితంలో భాగం కావాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు.
యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెలరోజులపాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్న విషయం తెలిసిందే .