Politics31st Oct 05:11 PMSunil Byrisetty1 min read

ప్రశాంతమైన పరిస్థితుల్లో ఓటు వేసేలా ఏర్పాట్లు: ఎస్ఈసీ

స్థానిక సంస్థల ఎన్నికలపై సంబంధిత శాఖలతో మాట్లాడామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలతోనూ నిరంతరం మాట్లాడుతున్న

ప్రశాంతమైన పరిస్థితుల్లో ఓటు వేసేలా ఏర్పాట్లు: ఎస్ఈసీ
స్థానిక సంస్థల ఎన్నికలపై సంబంధిత శాఖలతో మాట్లాడామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలతోనూ నిరంతరం మాట్లాడుతున్నామన్నారు. ప్రతి జిల్లాలో శాంతిభద్రతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన పరిస్థితుల్లో ఓటు వేసేలా చూస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సరిపడా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ నగరపాలికల్లో 118 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. వివిధ మున్సిపాలిటీల్లో 756 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. 13,504 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామని, సీసీ టీవీ కవరేజ్, వెబ్‌కాస్టింగ్‌పై ఇప్పటికే కలెక్టర్లకు చెప్పామని, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కూడా సీసీటీవీ కవరేజ్ ఉంటుందని పునేఠా స్పష్టం చేశారు.
Scroll for the next article