Politics7th Nov 03:31 PMSunil Byrisetty1 min read
అక్రమం చేసి.. తిరిగి కేసులా?
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమన్నారు. వెంగళాయపాలెంలో పోలింగ్ ముగిసిన తర్వాత నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారని అడిగారు.స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేస్తారా అంటూ మండిపడ్డారు. బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేసి.. తిరిగి మా వాళ్లపై అక్రమకేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉందని, ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.