News23rd Jul 05:18 PMSunil Byrisetty1 min read

ఏఐతో బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ

ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన యాప్ రూపొందించనున్నామన్నారు. ఏఐత

ఏఐతో బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన యాప్ రూపొందించనున్నామన్నారు. ఏఐతో బీసీ హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెరగనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 30లోగా హాస్టళ్లకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదరణ 3.0 ద్వారా కుల వృత్తుదారులకు ఆధునిక పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ నగరంలో జిల్లాల బీసీ సంక్షేమ శాఖాధికారులు, డీబీసీడబ్ల్యూఈవోలు, ఏబీసీడబ్ల్యూఈవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. వచ్చే నెల అయిదో తేదీలోగా నిర్దేశించిన లక్ష్యం మేర అడ్మిషన్లు పూర్తి చేయాలని మంత్రి సవిత స్పష్టంచేశారు.
Andhra Pradesh Welfare Schemes
BC Welfare
S. Savitha
Artificial Intelligence
BC Hostels
Hostel Monitoring
Adarana 3.0
ప్రభుత్వ హాస్టళ్లు
ఏఐ పర్యవేక్షణ
Scroll for the next article