News16th May 03:06 PMSunil Byrisetty1 min read
‘‘ఓసీ వైశ్య’’ని ఆర్యవైశ్యగా మార్చాలి
గవర్నమెంటు వారు విధి, విదానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు / కుల గణనలను బట్టి ఉన్న ఆర్య వైశ్యులను వైశ్య/శెట్టి / గుప్త / కోమటి / లాగా వివిధ వర్గాల వారుగా విభజించి చ
గవర్నమెంటు వారు విధి, విదానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు / కుల గణనలను బట్టి ఉన్న ఆర్య వైశ్యులను వైశ్య/శెట్టి / గుప్త / కోమటి / లాగా వివిధ వర్గాల వారుగా విభజించి చూపడం వలన గందరగోళం ఏర్పడుతోంది.
రాష్ట్రంలో గవర్నమెంటు వారు నిర్వహించే అన్ లైన్ వెబ్ సైట్ లలో, యాప్ లలో కూడా ఆర్య, వైశ్యులను వివిధ వర్గాలుగా చూపించడం జరుగుతోంది.
ముఖ్యంగా, మండల రెవెన్యూ అధికారులు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాలలో కూడా "ఓసీ వైశ్య " అని మాత్రమే వస్తుంది.
అందువలన ఆర్యవైశ్య వర్గాల వారు ఒకవిధమైన తికమకకు గురవుతున్నారు.
కావున గవర్నమెంటు వారి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఉన్నవారిని, భవిష్యత్తులో జరగబోయే " కుల గణన" విషయంలో గాని యాప్లలో గాని, ఆన్ లైన్ సైట్లలోగాని ఒకే వర్గంగా అదీ " ఆర్య వైశ్య" అనే విధంగానే ఉండేటట్లు చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ విన్నవించారు.