News13th Jul 01:20 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె సందడి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె సందడి నెలకొంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సారె సమర్పణకు భక్తుల రద్దీ పెరిగింది. ఇప్పటికే సుమారు 30 వేలు దాటిన భక్తుల సంఖ్య అ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె సందడి నెలకొంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సారె సమర్పణకు భక్తుల రద్దీ పెరిగింది. ఇప్పటికే సుమారు 30 వేలు దాటిన భక్తుల సంఖ్య అని తెలుస్తోంది. దేవస్థానంలోని మహా మండపం అంతా భక్తులమయంగా కనిపిస్తోంది. భక్తులరద్దీ దృష్ట్యా క్యూ లైన్లలోని భక్తులకు బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నవాటర్ బాటిల్స్ అందించడానికి ఈవో శీనానాయక్ చర్యలు తీసుకున్నారు. శ్రీ అమ్మ వారి నైవేద్యం సమయంలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. చంటి పిల్లల తల్లులు, వృద్ధులు, వికలాంగులకు మాత్రమే లిఫ్ట్ ఏర్పాటు చేశారు.