Spiritual17th Jul 10:06 AMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిలో కొనసాగుతున్న ఆషాడ మాస సారె

ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వేకువ జాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల కోసం ప్రత్యేకంగా పలు ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు పాలకమండలి పోలీస్ అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంట

ఇంద్రకీలాద్రిలో కొనసాగుతున్న ఆషాడ మాస సారె
ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వేకువ జాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల కోసం ప్రత్యేకంగా పలు ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు పాలకమండలి పోలీస్ అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బందోబస్తు నడుమ ఆషాడ మాస సారె సమర్పణ కొనసాగుతోంది. విజయవాడ ఇంద్రకలాద్రి క్షేత్రానికి విచ్చేసే భక్తులలో పెద్ద వయసు వారు ఉండటాన్ని గమనించి వెంటనే మహా మండపం ఆరవ అంతస్తులో ఆషాడ మాస సారె అమ్మవారికి సమర్పించేందుకు విచ్చేసే పెద్ద వయసు గల వారికి ప్రత్యేకంగా కూర్చునేందుకు కార్యనిర్వాహణ అధికారి శీనా నాయక్ కుర్చీలు ఏర్పాటు చేయించారు. అమ్మవారి ఆలయంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సారె సమర్పించేందుకు వచ్చే భక్తులందరికీ ప్రత్యేక సదుపయాలు కలగజేశారు.
Andhra Pradesh
Temple Festival
Kanaka Durga Temple
Indrakeeladri
Ashada Sare
Vijayawada
Devotees
ప్రత్యేక ఏర్పాట్లు
సీనియర్ పౌరులు
ఆధ్యాత్మికం
దేవాలయం
Scroll for the next article