News18th Jul 05:01 PMSunil Byrisetty1 min read
ఆ పదవి రాగానే టీడీపీకి రాజీనామా!
తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో, పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజకీ
తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో, పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజకీయ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనను గోవా గవర్నర్ గా నియమించింది. త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తనకు ఇప్పటివరకు అనేక అవకాశాలు కల్పించిన టీడీపీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు రాజీనామా లేఖ పంపారు.