News26th Jul 12:35 PMSunil Byrisetty1 min read

గోవా గవర్నర్‌గా అశోక్ ప్రమాణం

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. పనాజిలోని రాజ్ భవన్ బంగ్లా

గోవా గవర్నర్‌గా అశోక్ ప్రమాణం
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. పనాజిలోని రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. గోవా గవర్నర్‌గా అశోక్ పేరు ప్రకటించిన తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Andhra Pradesh news
Ashok Gajapathi Raju
Goa Governor
Pusapati Ashok Gajapathi Raju
గోవా గవర్నర్‌గా అశోక్ ప్రమాణం
Scroll for the next article