Spiritual20th Aug 11:39 AMSunil Byrisetty1 min read

దేవుని కడపలో "అష్టబంధన మహా సంప్రోక్షణ"

కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తిరుమల తొలిగడప అయిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 23 నుండి 26 వరకు "అష్టబంధన మహా సంప్రోక్షణ", కుంభాభిషేకం శాస్త్రోక్

దేవుని కడపలో "అష్టబంధన మహా సంప్రోక్షణ"
కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తిరుమల తొలిగడప అయిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 23 నుండి 26 వరకు "అష్టబంధన మహా సంప్రోక్షణ", కుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అష్టబంధన మహా సంప్రోక్షణ షెడ్యూల్ (ఆగస్టు 23 – 26)ఈ నాలుగు రోజుల పాటు వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం ఆలయంలో విశేష పూజలు, హోమాలు మరియు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 21 లోగా ధ్వజస్తంభం, బలిపీఠానికి సంబంధించిన ఇత్తడి రేకుల పనులు, విద్యుత్ దీపాల అలంకరణ పనులను పూర్తి చేస్తారు. మహా సంప్రోక్షణ వేడుకల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తోంది. దాదాపు ఏడాది కాలం తర్వాత స్వామివారి మూలవిరాట్ రూపాన్ని గర్భగుడిలో నేరుగా చూసే అవకాశం కలుగుతుండటంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
Temple news
Devuni Kadapa
Devuni Kadapa Temple
Sri Lakshmi Venkateswara Swamy Temple
Maha Samprokshanam
కుంభాభిషేకం
టీటీడీ
తిరుమల
కడప
ఆంధ్రప్రదేశ్
ఆలయ వార్తలు
Scroll for the next article