News13th Nov 04:28 PMSunil Byrisetty1 min read
అనుచిత పోస్టులపై అసోం పోలీసుల కొరడా
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటనపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై అసోం పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా విషాదం నింపగా, కొందరు మాత్రం దీనిపై పైశాచిక ఆనందం వ్యక్తం
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటనపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై అసోం పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా విషాదం నింపగా, కొందరు మాత్రం దీనిపై పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరమైన పోస్టులు పెట్టిన వారిపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా 15 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనను కీర్తిస్తూ పోస్టులు పెట్టిన వారిపై అసోం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.