News27th Sep 02:11 PMSunil Byrisetty1 min read

అసెంబ్లీ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలకం

అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎనిమిది జాయింట్ కమిటీల తొలి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్ర

అసెంబ్లీ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలకం
అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎనిమిది జాయింట్ కమిటీల తొలి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని చెప్పారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలలో కూడా పర్యటనలు చేపట్టాలని తెలిపారు. ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్టసభలకు ఒక ఆయువుపట్టు లాంటిది. సభాసమావేశాలు సంవత్సరం పొడవునా జరపటం సాధ్యం కాని పని. ఈ కమిటీలు సభ పని బారాన్ని పంచుకుంటాయి. సంవత్సరం పొడవునా పనిచేస్తాయి. ఈ కమిటీలన్నీ శాసనసభ, మండలి లోని ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో కీలకంగా ఉంటాయని అన్నారు. కమిటీల ఏర్పాటుతో ప్రజల సమస్యలు మరింత సమర్థవంతంగా చర్చించబడతాయని, ప్రజాస్వామ్య స్థిరత్వానికి తోడ్పడతాయని స్పీకర్ అన్నారు.
Andhra Pradesh Assembly
Assembly Committees
Legislative Committees
Democratic Governance
Public Grievances
Lawmaking Process
చట్టసభా ప్రక్రియ
ప్రభుత్వ పర్యవేక్షణ
రాష్ట్ర శాసనసభ
Scroll for the next article