News14th May 04:09 PMSunil Byrisetty1 min read

బడ్జెట్ అంచనాలపై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష

2019-2022 ఏడాదిల బడ్జెట్ అంచనాలపై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్య

బడ్జెట్ అంచనాలపై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష
2019-2022 ఏడాదిల బడ్జెట్ అంచనాలపై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన ఎస్టిమేట్స్ కమిటీ రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమైంది. 2019 నుంచి 2022 వరకూ మూడేళ్ళ కాలంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించింది. సమావేశంలో రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ, డా.పార్ధసారధి, మద్దిపాటి వెంకటరాజు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, పాసిం సునీల్ కుమార్, అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. మిగిలిన సంవత్సరాలకు సంబంధించి కూడా కమిటీ మరోసారి సమీక్ష నిర్వహించనుంది.
Andhra Pradesh
Assembly Estimates Committee Review
2019-22 Budget Estimates
2019-2022 ఏడాదిల బడ్జెట్ అంచనాలపై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష
ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు
Scroll for the next article