News9th Jun 11:16 AMSunil Byrisetty1 min read

ముంబైలో లోకలో ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారి పడటంతో ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్ ట్రైన్ ముం

ముంబైలో లోకలో ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారి పడటంతో ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కి వెళ్తుండగా ముంబ్రా- దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. ఫుట్ బోర్డు మీద పలువురు నిలబడి ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు పట్టును కోల్పోయి రైలు పట్టాలపై పడిపోయారు. ఆ సమయంలో రైలు వేగం అధికంగా ఉండటంతో తీవ్ర గాయాలు అయిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు కావడంతో వారికి రైల్వే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Mumbai
local train accident
Diva railway stations
five dead
12 members injured
ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్
ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు
Scroll for the next article