News17th Dec 02:03 PMSunil Byrisetty1 min read

అటల్ జీ అంటేనే నమ్మకం, అభివృద్ధి సుపరిపాలన

జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి. అటల్ జీ అంటేనే నమ్మకం, అభివృద్ధి సుపరిపాలన అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, భారతరత

అటల్ జీ అంటేనే నమ్మకం, అభివృద్ధి సుపరిపాలన
జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి. అటల్ జీ అంటేనే నమ్మకం, అభివృద్ధి సుపరిపాలన అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ రోజు వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం, విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఈ నెల 25న అమరావతిలో యాత్ర ముగుస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారిలో ఎవరిని మీరు ఆదర్శంగా తీసుకుంటాని నన్ను చాలా మంది అడిగారు. ఒక మత్స్యకార గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆనాటి సింగపూర్ ప్రధాని లీ క్వాన్ యూ, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందుగా తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్ పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకున్నానని పేర్కొన్నారు.
Andhra Pradesh
Atal Bihari Vajpayee
Nara Lokesh
Bharat Ratna
NDA
Atal Sandesh
Machilipatnam
మోదీ సుపరిపాలన బస్సు యాత్ర
మచిలీపట్నం
కృష్ణా జిల్లా
బీజేపీ
సుపరిపాలన
అభివృద్ధి
Scroll for the next article