News24th Dec 11:01 AMSunil Byrisetty1 min read

అమరావతిలో అటల్ స్మృతివన్

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల ఎత్తు గల కాంస్య విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా డి

అమరావతిలో అటల్ స్మృతివన్
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల ఎత్తు గల కాంస్య విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 25 (గురువారం) నాడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమరావతిలోని వెంకటపాలెం వద్ద ఉన్న 'అటల్ జీ స్మృతి వన్' లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది 14 అడుగుల ఎత్తు గల భారీ కాంస్య విగ్రహం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి విగ్రహం ఇదే కావడం విశేషం . ఈ ప్రాంతాన్ని కేవలం విగ్రహావిష్కరణకే పరిమితం చేయకుండా, వాజ్‌పేయి జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం తరహా స్మారక చిహ్నంగా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 వాజ్‌పేయి విగ్రహాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh
Atal Bihari Vajpayee
Amaravati
Atal Smriti Van
Vajpayee Statue
Bharat Ratna
Bronze Statue
వాజ్‌పేయి శతజయంతి
డిసెంబర్ 25
అటల్–మోదీ సుపరిపాలన యాత్ర
స్మారక మ్యూజియం
Scroll for the next article