News6th Dec 03:53 PMSunil Byrisetty1 min read

అటల్–మోడీ సుపరిపాలన పాదయాత్ర 11 నుంచి

విజయవాడలో వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల పోస్టర్, లోగోలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, బిజెపి ఎపి అధ్యక్షుడు పి.వి.యన్ మాధవ్ ఆవిష్కరించారు. డిసెంబరు 11 నుంచి 25 వరకు ఏపి వ్యాప్తంగా అట

అటల్–మోడీ సుపరిపాలన పాదయాత్ర 11 నుంచి
విజయవాడలో వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల పోస్టర్, లోగోలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, బిజెపి ఎపి అధ్యక్షుడు పి.వి.యన్ మాధవ్ ఆవిష్కరించారు. డిసెంబరు 11 నుంచి 25 వరకు ఏపి వ్యాప్తంగా అటల్–మోడీ సుపరిపాలన యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. వాజపేయి దేశానికి అందించిన సేవలు, నైతిక రాజకీయాలు కొత్త తరాలకు తెలియజేయడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు. ధర్మవరం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో రోజూ రెండు సభలు ఉంటాయని వివరించారు. డిసెంబరు 25న అమరావతిలో జరిగే శత జయంతి సభకు సీఎం చంద్రబాబు హాజరవుతారని ప్రకటించారు. కార్యక్రమంలో నాగోతు రమేష్ నాయుడు, సయ్యద్ భాషా, పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్, వల్లూరు జయప్రకాశ్ పాల్గొన్నారు.
Andhra Pradesh
Padayatra
Good Governance
Vajpayee Legacy
Atal Modi Good Governance Yatra
Vajpayee Centenary Celebrations
Srinivasa Varma
PVN Madhav
BJP
వాజ్‌పేయి సేవలు
నైతిక రాజకీయాలు
శతజయంతి ఉత్సవాలు
Scroll for the next article