News16th Aug 03:08 PMSunil Byrisetty1 min read

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాహస యాత్ర

కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ అథ్లెట్, జాతీయ మోడర్న్ పెంటథ్లాన్ క్రీడాకారుడు గోవింద్ రాజు కొక్కిరిపాటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించారు. మచిలీపట్నంలోని కొబ్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాహస యాత్ర
కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ అథ్లెట్, జాతీయ మోడర్న్ పెంటథ్లాన్ క్రీడాకారుడు గోవింద్ రాజు కొక్కిరిపాటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించారు. మచిలీపట్నంలోని కొబ్బరి తోట సిద్ధార్థ స్కూల్లో చదివిన గోవింద్ రాజు, విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 160 కిలోమీటర్ల అల్ట్రా ఫ్రీడమ్ ట్రిబ్యూట్ రన్ అండ్ సైక్లింగ్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు, తిరిగి విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు సాగిన ఈ సాహస యాత్రను మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 14 గంటల 50 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన గోవింద్ రాజుకు మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం. నవీన్, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కలిసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందజేశారు.
Andhra Pradesh
Independence Day
Govind Raju Kokkiripati
Machilipatnam
Vijayawada
Ultra Freedom Tribute Run
Cycling Challenge
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్
మోడర్న్ పెంటథ్లాన్
అథ్లెట్
క్రీడా విజయం
కృష్ణా జిల్లా
Scroll for the next article